కరోనా కాటుకు నిర్మాత బలి

బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో కరోనా కలకలం సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన కొంత మంది మీద కరోనా పంజా విసిరింది. తాజాగా బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అదే కరోనా బారిన పడి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనీల్ సూరి మరణించారు. ఈ విషయం మీద అనీల్ సోదరుడు రాజీవ్ సూరీ మాట్లాడుతూ.. అనీల్ జూన్ 2 నుండి హై ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆ తర్వాత రోజు నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని అన్నారు. దీంతో ఆయన్ను లీలావతి-హిందూజా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. అయితే ఆస్పత్రి సిబ్బంది ఆయనను అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించారని దీంతో ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనీల్ ను చేర్పించారని అక్కడే చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారని రాజీవు పేర్కొన్నారు. ఇక ఆయనకు నిన్న కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనీల్‌కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనీల్ .. రాజ్‌కుమార్, రేఖ కాంబినేషన్లో 'కర్మయోగి', 'రాజ్ తిలక్' వంటి చిత్రాలు నిర్మించారు.