English   

జగన్ తో మీటింగ్...చిరు, బాలయ్యలకి ఇన్విటేషన్...కానీ బాలయ్య 

Balakrishna
2020-06-06 16:01:31

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ షూటింగ్ అనుమతి కోసం తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా సినిమా పెద్దలు భేటీ అయ్యారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది సినిమా పెద్దలు వెళ్లి కలవబోతున్నారు. ఈ మేరకు వాళ్లు జూన్ 9న అపాయింట్మెంట్ తీసుకున్నట్లు చెబుతున్నారు. 

సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు సహా కొందరు దర్శక నిర్మాతలు కూడా వైయస్ జగన్ తో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో చిరంజీవి ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఈయన ఇండస్ట్రీ మీటింగ్స్ నుంచి పూర్తిగా దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరో పక్క ఈ మీటింగ్ కు బాలకృష్ణకు ఆహ్వానం అందిందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ విషయం మీద సీ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు మూవీ మొఘల్ డా. డి.రామానాయుడు 85వ జయంతి వేడుకలు ఫిలిమ్ ఛాంబర్ లో జరిగాయి. 

ఫిలిం ఛాంబర్  వద్ద రామానాయుడు విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించారు సి.కళ్యాణ్, డి.సురేష్ బాబు, అభిరామ్, కే.యస్.రామారావు,కాజా సూర్య నారాయణ తదితరులు. ఈ సందర్భంగా సి‌.కల్యాణ్ మాట్లాడుతూ ఈ నెల 9 తారీకు మద్యాహ్నం 3 గంటలకు ఏపీ సీఎం జగన్ ను కలవబోతున్నామని, ఏపీలో సినీ పరిశ్రమ డెవలప్మెంట్ కొసం వారితో మేము చర్చించనున్నామని, ఈ సమావేశానికి చిరంజీవి, బాలకృష్ణ గారితో సహా అందరినీ  ఆహ్వానించటం జరిగిందని కానీ బాలకృష్ణ గారు పుట్టిన రోజు ఉండడం వలన రాలేకపోతున్నారని, మేము వెళ్లి మాట్లాడిన అనంతరం అక్కడే ప్రెస్ మీట్ పెడతామని ఆయన చెప్పుకొచ్చారు.

More Related Stories