English   

సర్కారు వారి పాటకు పరశురాం భారీ రెమ్యూనరేషన్..

Parasuram mahesh
2020-06-06 18:53:39

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో పర్లేదనిపించి గీత గోవిందం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటి ఇచ్చాడు పరశురాం. ఈ సినిమాతో నిర్మాత అల్లు అరవింద్ దాదాపు 55 కోట్ల లాభాలు అందుకున్నాడని లెక్కలు చెబుతున్నాయి. గీత గోవిందం తర్వాత రెండేళ్లకు పైగా ఖాళీగానే ఉన్నాడు దర్శకుడు పరశురామ్ ఈ మధ్య మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమా అనౌన్స్ చేశాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి 2021 సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడని తెలుస్తోంది. అందులో ఒకటి యంగ్ గెటప్ కూడా ఉండబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం పరుశురాం భారీ పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. అడ్వాన్స్ రూపంలోనే 4 కోట్లు అందుకున్న ఈయన.. సినిమా కోసం మొత్తం 8 కోట్లు వసూలు చేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తోడు లాభాల్లో 20 శాతం వాటా కావాలని అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో గీత గోవిందం సినిమా విషయంలో కూడా ఇలాగే చేశాడు పరశురామ్. అప్పుడు ఆ సినిమాకు భారీగానే పారితోషికం అందుకున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు కూడా ఇదే సూత్రం ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కచ్చితంగా బిజినెస్ కూడా 140 కోట్లకు అటు ఇటుగా జరిగేలా కనిపిస్తుంది. రేపు సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అయిందంటే పరశురాం పంట పండటం ఖాయం. బ్యాంకు మోసాల చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పరశురామ్. అందుకే సర్కారు వారి పాట అనే టైటిల్ పెట్టాడు. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

More Related Stories