English   

సోషల్ మీడియాలో రామ్ మరో రేర్ ఫీట్

Ram
2020-06-07 07:30:19

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సోషల్ మీడియాలో మరో రికార్డ్ అందుకున్నారు. ఆయన తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానెల్‌ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు ఆయనకు అందులో 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ నమోదు అయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన తన ఫాలోవర్స్‌ కు థ్యాంక్స్ చెబుతూ తన పెంపుడు కుక్క బార్ట్‌ ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక తన యూట్యూబ్ ఛానెల్‌కు 1 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ రావడంపై రామ్ ట్విట్టర్‌ లో బిగ్ థ్యాంక్స్ అంటూ కామెంట్ చేశారు. ఇక ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ హిట్ తో జోష్ మీదున్న రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తడమ్ సినిమాకి ఈ సినిమా రీమేక్. ఇక ఈ సినిమాలో  మాళవిక శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి స్రవంతి రవికిషోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More Related Stories