English   

రాములో రాముల అంటూ అదిరిపోయే స్టెప్పులేసిన సుమ కనకాల..

Suma Kanakala
2020-06-07 08:15:37

టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల లాక్ డౌన్ సమయాన్ని కూడా ఇంట్లోనే ఉండి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎలాగో బయటికి వెళ్లేది లేదు కాబట్టి తన సుమక్క యూట్యూబ్ ఛానల్ ను డెవలప్ చేసుకుంటుంది. అందులో భాగంగానే మిగిలిన యాంకర్స్ తో మంచి మంచి ఫన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తుంది యాంకర్ సుమ. దాంతో పాటు తాను కూడా ఇంట్లో ఉండి అప్పుడప్పుడు కామెడీ వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆ మధ్య ఇంట్లో ఉన్న పనిమనిషితో కూడా అదిరిపోయే వీడియో షూట్ చేసింది సుమ. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలోని రాములో రాముల పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది సుమ కనకాల. ఇంట్లో ఉన్న కుక్కతో కలిసి డాన్స్ చేసింది. అల్లు అర్జున్ అందంగా చేస్తే సుమ మాత్రం పిచ్చిపిచ్చిగా చేసి పడేసింది. ఈ వీడియోను తన ఫేస్ బుక్ పేజీలో అప్ లోడ్ చేసిన సుమ కాసేపటికే బోలెడన్ని లైక్స్ కామెంట్స్ సంపాదించుకుంది. వీడియో కూడా పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. బుల్లితెరపై కొత్త ప్రోగ్రామ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు కాబట్టి ఉన్న సమయాన్ని ఇలా గడిపేస్తుంది సుమ కనకాల. అన్నట్లు ఈమె భర్త రాజీవ్ కనకాలతో కాకుండా ప్రత్యేకంగా వేరే ఇంట్లో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

More Related Stories