ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జ కన్నుమూత...

2020-06-07 17:02:49
కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ హీరో చిరంజీవి సర్జ కన్నుమూసాడు. హార్ట్ ఎటాక్‌తో ఈయన ప్రాణాలు వదిలాడు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన బంధువు. జూన్ 6న ఈక్ష్నకు శ్వాస సమస్య వచ్చింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చిరంజీవి వయసు చాలా తక్కువ కావడంతో ఇది హృదయ సంబంధ వ్యాధి అని కుటుంబం అనుకోలేదు. కానీ ఊపిరి ఆడకుండా ఉండటంతో పాటు తీవ్రమైన ఛాతీ నొప్పి కూడా వచ్చింది. దాంతో అతను ఇప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతన్ని బతికించడానికి చాలా ప్రయత్నించినా కూడా కుదర్లేదు. ప్రస్తుతం ఇతడి చేతిలో అరడజన్ సినిమాలున్నాయి. కొన్నేళ్లుగా కన్నడ నాట మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన హఠాన్మరణం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు