English   

కుకింగ్ క్లాసుల్లో చేరిన సమంతా...సూప్ చేసి...

Samanthacooking.jpg
2020-06-08 06:23:16

ఒకప్పుడు వంట చేయడం మహిళల డ్యూటీ అన్నట్టు ఉండేది కానీ నేటి సమాజంలో అలాంటి అంతరాలు తగ్గాయనే చెప్పాలి. మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుండడంతో వంట నేర్చుకోవడం కూడా తగ్గిపోయింది. ఇక మనం తినే తిండి మన దాకా రావడం వెనక ఎంత పెద్ద కష్టం దాగి ఉందో నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవు తోందని చెప్పుకొచ్చింది సమంత. ఇటీవలే ఆమె తన టెర్రస్‌పై గార్డెనింగ్‌ మొదలు పెట్టింది. ఈ గార్డెనింగ్‌ చేయడం కోసం ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్న ఆమె ఈ క్లాసుల ద్వారా తెలుసుకుంటున్న కొత్త విషయాలు తనకు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయని చెప్పుకొచ్చింది.

ఇన్నాళ్లూ భూమితో నాకు ఉన్న కనెక్షన్‌ కోల్పోయానని ఇప్పుడు అనిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చింది. ఒక చిన్న విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది భూమిని చీల్చుకుని పైకి రావడానికి చాలా సంఘర్షణ పడుతుందని అలా చీల్చుకుని పైకి వచ్చాక అది రోజులు, నెలలు, సంవత్సరాలు పెరుగుతుందని ఆమె పేర్కొంది. అంతే కాదు ఆమె గార్డెనింగ్ క్లాసులతో పాటు కుకింగ్‌ క్లాసుల్లో కూడా చేరారు. అందులో భాగంగా ఓ సూప్‌ను తయారు చేశారు. తన గార్డెనింగ్‌లో పెరిగిన మొక్కల ఆకులతోనే సమంత ఈ సూప్‌ను తయారు చేయడం గమనార్హం.

More Related Stories