English   

రజనీ రాజకీయాల గురించి ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు  

kushboo
2020-06-08 06:51:59

సినిమాలకి రాజాకీయాలకి అవినాభావ సంబంధం ఉందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా సౌత్ లో. ఇక్కడ సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చి సీఎంలు అయిన వారున్నారు. అయితే వారి తరువాత రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎవరూ పెద్దగా రాణించలేదనే చెప్పాలి. తమిళం సంగతి తీసుకుంటే చిత్ర పరిశ్రమకు చెందిన వారు రాజకీయాల్లోకి రావాలని నటి ఖుష్బూ అంటున్నారు. ఆమె కొన్నేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తన సహ నటులు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ రాజకీయ ప్రవేశం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌ తాను ఎన్నికల్లో నిలబడనని అప్పట్లో పేర్కొనగా ఆ విషయం మీద స్పందించిన ఖుష్భూ ఆయన ‘కింగ్‌’లా ఉండాలని.. ‘కింగ్‌ మేకర్‌’ కాకూడదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎమ్‌. కరుణానిధి మరణంతో తమిళనాడు రాజకీయాల్లో లోటు ఏర్పడిందన్న ఆమె ఆ లోటు త్వరలోనే తీరాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇక చిత్ర పరిశ్రమకు చెందిన వారు రాజకీయాల్లోకి రావాలనేది తన ఆశ అన్న ఆమె అది రజనీ, కమల్‌తో ఆగి పోకూడదని యువ నటీనటులు వస్తే.. మార్పు మరోలా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.  

More Related Stories