English   

బాలీవుడ్ భీష్మ ఫిక్స్ అయ్యాడు 

 Ranbir Kapoor
2020-06-08 07:05:19

ప్రస్తుతం రీమేక్స్ యుగం నడుస్తోంది. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో బాషలో పెద్దఎత్తున రీమేక్ చేస్తున్నారు. కంటెంట్ ఉంటె అది ఏ బాష సినిమా అని కూడా చూడకుండా తమ తమ బాషలలోకి రీమేక్ చేసుకుంటున్నారు మేకర్స్. తాజాగా నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ఇపుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ రేటుకే దక్కించుకున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాని రణ్‌బీర్ కపూర్‌తో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని ఒక వేళ రణ్‌బీర్ కపూర్ ఒప్పుకోకపోతే వరుణ్ ధావన్ లేదా టైగర్ ష్రాఫ్ హీరోగా రీమేక్ చేయాలనే ఆలోచనలో జోహార్ ఉన్నాడని ప్రచారం జరిగింది. కానీ రణబీర్ కపూర్ సహా మిగతా ఇద్దరికీ వరుస కమిట్మెంట్లు ఉండటంతో, అర్జున్ కపూర్ ను తీసుకున్నట్టుగా కూడా ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా రణబీర్ కపూర్ ఏ ఈ సినిమా చేస్తున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే హీరోయిన్ తదితర విషయాలు సహా ఈ సినిమా గురించి ఒక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయన్నమాట.

More Related Stories