English   

వినాయక్ కు హీరో కావలెను 

Vinayak
2020-06-08 07:18:51

అఖిల్ సినిమా ఏ నిముషాన చేశారో కానీ ఆనాటి నుండే డైరెక్టర్ వినాయ‌క్ కెరీర్ గ్రాఫ్ నేలను తాకాలని చూస్తోంది. ఒక‌ప్పుడు వినాయ‌క్‌తో సినిమాలు తీసేందుకు క్యూలో నిలబడిన స్టార్ హీరోలు ఇప్పుడు ఆయ‌న కాల్ ఎత్తడానికి కూడా ఆలోచిస్తున్నారు. 2018లో వచ్చిన ఇంటిలిజెంట్ సినిమా కూడా భారీ దెబ్బ వేయడంతో ఆ సినిమా త‌ర్వాత బాల‌య్య సినిమా ప‌ట్టాలు ఎక్క‌లేదు. అయితే ఆయన ఇప్పుడు డైరెక్టర్ నుండి హీరోగా మారుతున్నారని అంటూ శీనయ్య అనే సినిమా కూడా మొదలు పెట్టారు. డైరెక్ట‌ర్ శంక‌ర్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన న‌ర‌సింహ‌రావు అనే ద‌ర్శ‌కుడు గతంలో శరభ అనే సినిమా తీశారు. ఇప్పుడు ఆయన రెడీ చేసిన స్క్రిఫ్ట్ తోనే సినిమా తీయాల్సి ఉంది. ఆ సినిమా ఏవో కారణాల వల్ల అటకెక్కిందని అందుకే ఆయన మళ్ళీ దర్శకత్వం వైపు చూస్తున్నారని చెబుతున్నారు. గత రెండు నెలలుగా కరోనా రణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన వినాయక్ ఆ సమయంలో కొన్ని స్కిప్ట్ లను స్టోరీ లైన్స్ ను సిద్దం చేశాడని అంటున్నారు. అయితే వినాయక్ కు ఇప్పటికి ఇప్పుడు డేట్లు ఇచ్చి సినిమా చేసేందుకు ఏ హీరో రెడీగా లేడు. ఆయన ట్రాక్ రికార్డ్ సంగతి పక్కన పెట్టినా అందరు హీరోలు ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిలో అయినా వినాయక్ కు డేట్లు ఇచ్చేందుకు ఏ హీరో అయినా ఇంట్రెస్ట్ చూపిస్తాడా అనేది చూడాల్సి ఉంది.  
 

More Related Stories