English   

బోయపాటి తర్వాత బాలయ్య సినిమా మీద క్లారిటీ 

Balakrishna
2020-06-08 10:29:11

వయసుతో సంబంధం లేకుండా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయింది. అయితే లాక్ డౌన్ రావడంతో సైలెంట్ అయిపోయారు. తాజాగా బాలయ్య తరువాతి సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెర మీదకి వచ్చిందిది. అదేంటంటే నిజానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఆదిత్య 369కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు గతకొద్ది కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 

నిజానికి బాలయ్య 100వ చిత్రంగా ‘ఆదిత్య 999’ రావాల్సింది. అనుకోని కారణాల వల్ల ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఆ తరువాత బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ అవ్వడం ఆ తర్వాత వరుస సినిమాలు చేయడంతో బిజీ అయిపోయారు. అయితే ఈసరి ఈ సీక్వెల్ ను బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలయింది. అయితే ఈ విషయం మీద తాజాగా క్లారిటీ ఇచ్చాడు బాలయ్య. ఆదిత్య 369కి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నానన్న అయన సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇది కనుక తెరకెక్కితే బాలయ్య కెరీర్లో మరో బెస్ట్ సినిమా అని చెప్పచ్చు.

More Related Stories