English   

ఎంత దారుణం.. కన్నడ చిరంజీవి చచ్చిపోతే మన మెగాస్టార్ కు నివాళి..

Shobhaa De
2020-06-08 12:14:28

ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు నటులు ఉండటం సర్వసాధారణం. అలాగని ఒకరు చనిపోతే మరొకరికి శ్రద్ధాంజలి వహించడం అనేది అంత కంటే దారుణం మరొకటి ఉండదు. తాజాగా ఇదే జరిగింది. ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జ గుండెపోటుతో మరణించాడు. కేవలం 39 ఏళ్ల ఈ నటుడు కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు చనిపోవడంతో అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ఈయన. ఇదిలా ఉంటే కన్నడ చిరంజీవి చనిపోతే మన చిరంజీవికి ఒక మేధావి సోషల్ మీడియాలో శ్రద్ధాంజలి ఘటించింది. ఆమె పేరు శోభ. 72 ఏళ్ల జర్నలిస్ట్.. దాదాపు 30 పుస్తకాల వరకు కూడా రాసింది. అలాంటి వ్యక్తి చనిపోయింది ఎవరు అనే కనీస జ్ఞానం కూడా లేకుండా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టి మరొక తార నేల రాలిపోయింది కొటేషన్ లు కూడా పెట్టింది. ఇది చూసిన మెగా అభిమానులకు మండిపోయింది. చనిపోయింది ఎవరో తెలుసుకోకుండా ఫోటో మార్చేసి ఇలా పెడితే ఎలా అంటూ శోభ డే తో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. ఇన్నేళ్ళు వచ్చాయి కనీస జ్ఞానం కూడా లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. తర్వాత తన తప్పు తెలుసుకుని అందరికీ క్షమాపణ చెప్పింది శోభ. కానీ అప్పటికే ఆమె పెట్టిన పోస్టు వైరల్ అయిపోయింది. 

More Related Stories