English   

ఆచార్య బడ్జెట్ లో కోత...చిరు సలహా 

Acharya
2020-06-08 14:49:38

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న తాజా మూవీ ఆచార్య. కరోనా వలన ఏర్పడిన లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పటికే ఈ సినిమా సుమారు 70 శాతం షూటింగ్ పూర్తయిందని అంటున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఎందుకో కానీ బాగా లేటయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. 

మెహర్ రమేష్, బాబీ అలాగే సుజీత్ తో కథా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా. సుజీత్ కి ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ పై ప్రస్తుతం సుజీత్ పని చేస్తున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలతో పాటు సినిమా పరిశ్రమ కూడా కుదేలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమీప కాలంలో చిత్ర పరిశ్రమ మునుపటి స్థితికి రావడానికి చాలా సమయం పట్టేలా ఉందని అంటున్నారు. 

ఈ సమయంలో చిరంజీవి తన అనుభవంతో ప్రొడ్యూసర్స్ కి విలువైన సందేశాలు ఇస్తున్నాడట. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే ఆలోచన మానుకోవాలని చెబుతున్నారట. అంతేకాక ఇది వరకే భారీ బడ్జెట్ చిత్రాలకు అడ్వాన్స్ లు ఇచ్చి ఉంటే వెనక్కి తీసుకోవడం మంచిదని ఆయన చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాక రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఆచార్య మూవీ బడ్జెట్ కూడా తగ్గించే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు సమాచారం. మరి ఈ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

More Related Stories