English   

ఇల్లు ఊడుస్తున్న సితార.. మురిసిపోతున్న అభిమానులు..

Sithara Ghattamaneni
2020-06-08 15:21:52

మహేష్ బాబు కూతురు సితార లాక్ డౌన్ సమయంలో ఇంటి పనులు కూడా నేర్చుకుంటుంది. తండ్రితో హాయిగా ఆటలాడుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇంటి పనులు కూడా చేస్తూ అమ్మకు సాయం చేస్తుంది. తాజాగా ఈమె ఇల్లు ఊడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు.. సితార యు ఆర్ సో క్యూట్ అంటున్నారు. మరో వైపు మహేష్ బాబు కూడా కూతురు చేస్తున్న పనులు చూసి మురిసిపోతున్నాడు. అనుకోకుండా దొరికిన ఈ లాక్ డౌన్ సమయం పూర్తిగా పిల్లల కోసం కేటాయించాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈయన పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాకు కమిట్ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం కరోనా వైరస్ భారత్ లో విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో సినిమా షూటింగులు ఉండటం కష్టంగానే కనిపిస్తోంది. అందుకే హాయిగా ఇంట్లో పిల్లలతో గడిపేస్తున్నాడు సూపర్ స్టార్. ఇంట్లో పిల్లలు చేసే పనులు చూసి సోషల్ మీడియాలో వాటికి ప్రమోషన్ చేస్తున్నాడు. 

More Related Stories