English   

రాజమౌళి ప్రత్యేక దందా.. ఆధిపత్యం కోసం ఆరాటం..

Rajamouli
2020-06-08 17:34:15

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ దర్శకుడు ఎవరు అంటే మరో అనుమానం లేకుండా రాజమౌళి అని చెబుతారు అందరూ. ఆయన చేసిన సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అయితే కరోనా వైరస్ కారణంగా మూడు నెలలుగా అందరూ షూటింగ్స్ మానేసి ఇంట్లోనే ఉండిపోయారు. ఇందులో భాగంగా మళ్లీ ఎప్పుడు మొదలు పెట్టాలి అనే దానిపై సినీ పెద్దలు ఒక్కొక్కరుగా కూర్చొని సమావేశాలు జరుపుతున్నారు. దానికి అనుగుణంగా నిర్మాతల మండలి కూడా కూర్చొని మాట్లాడుకుంటుంది. ఇలాంటి సమయంలో రాజమౌళి మాత్రం సినిమా పెద్దలమాట పట్టించుకోకుండా సొంతంగా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. బయట వేదికలపై వినయంగా ప్రవర్తించే రాజమౌళి వాస్తవంలో మాత్రం అహంభావం చూపుతూ ప్రస్తుతం ఇండస్టీలో ఉన్న ఎందరో దర్శకులను అవమానిస్తూ ఓ ప్రైవేట్ దర్శక దందాకు తెర తీస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతల మండలి తరహాలోనే దర్శకుల మండలి కూడా ఉండాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. 

పరిశ్రమలోని 25 మంది దర్శకులతో కలిపి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు దర్శకధీరుడు. కానీ ఇందులో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని.. వరుస విజయాలు అందుకుంటున్న వెంకీ కుడుముల లాంటి దర్శకులు కూడా అందులో లేరు అనేది బయటకు వచ్చిన వార్త. ఎప్పుడో పదేళ్ల కింద ఆవకాయ్ బిర్యానీ లాంటి ఫ్లాప్ సినిమా తీసిన అనీష్ కురువిల్లా కూడా ఈ సమావేశంలో ఉన్నాడు కానీ వెంకీ కుడుముల సహా మరికొందరు కూడా దర్శకులు మాత్రం ఇందులో కనిపించలేదు. పైగా ఈ సమావేశానికి దర్శకుల సంఘం అధ్యక్ష్య కార్యదర్శకులనే పిలవలేదు. దర్శకుల సంఘం బాధ్యుడుగా ప్రతి విషయాన్ని భుజాలపై వేసుకుని బాధ్యతగా ప్రవర్తిస్తోన్న ఎన్ శంకర్ కు ఈ సమావేశానికి ఆహ్వానం లేదంటే పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇండస్ట్రీ రూల్స్ కు వ్యతిరేకంగా గ్రూపులు కడుతూ.. దర్శకుల సంఘం ప్రధాన బాధ్యులను కూడా ఆహ్వానించకుండా ఓ ప్రైవేట్ ప్లేస్ లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఇప్పుడు రాజమౌళిని అందరూ అడుగుతున్నారు.

ఇండస్ట్రీలో  ప్రత్యేక దర్శకుల సంఘం కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నావా అంటూ విమర్శిస్తున్నారు కూడా. ఒకవేళ ఈ సమావేశం జరిగింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ కోసం అనుకుంటే ప్రస్తుతం సినిమాలు చేస్తున్న దర్శకుడు ఎందుకు పిలవలేదు అనేది మరో ప్రశ్న. ఇలా చాలా సమాధానం లేని ప్రశ్నలు ఇప్పుడు రాజమౌళి ముందు ఉన్నాయి. ఎప్పుడు సైలెంట్ గా కనిపించే రాజమౌళి కూడా ఇండస్ట్రీ రెండుగా చీల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ కొందరు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే భారీ సినిమాల పేరుతో స్టార్ హీరోలను ఏళ్లకేళ్లు  తన దగ్గర లాక్ చేసి అభిమానుల కోపానికి గురవుతున్నాడు రాజమౌళి. అదే సమయంలో తనదైన అహంభావంతో ఇప్పుడు ఇండస్ట్రీని రెండుగా చీల్చే పనిలో చాలా బిజీగా ఉన్నాడని.. లాక్ డౌన్ అంతా కొత్త కథలు రాసుకోవడానికి వాడుకుంటే.. రాజమౌళి మాత్రం కొత్త ఎత్తులతో పరిశ్రమను విభజించే కథలు రాసుకున్నాడా అనే విమర్శలు కూడా భారీగానే వెల్లువెత్తుతున్నాయి.

ఎప్పుడో సినిమాలు తీయడం మానేసిన దర్శకులను గుర్తు పెట్టుకొని మరీ పిలిచిన రాజమౌళి.. ఇప్పుడు యాక్టివ్ డైరెక్టర్స్ ను మాత్రం ఎందుకు మరిచిపోయాడు.. ఒకవేళ ఈ మీటింగ్ సారాంశం వేరే ఏదైనా ఉందా.. ఉంటే ఏమిటి.. అసలు రాజమౌళి ఎవరికీ తెలియకుండా ప్రత్యేకంగా దర్శకులను సేకరించి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ చాలా ప్రశ్నలు బయటికి వస్తున్నాయి. ఇప్పుడు మరి దీనికి ఆయన ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి. 

More Related Stories