English   

పెళ్లి తరువాత ఇబ్బంది పడ్డా..ఉపాసన ఆసక్తికర కామెంట్స్  

 Upasana
2020-06-10 13:39:01

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన కేవలం రాంచరణ్ భార్యగా మాత్రమే కాదు అపోలో గ్రూప్స్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ అదొక్కటే కాక ఇతర కార్యక్రమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన ట్వీట్స్ ,పోస్ట్ లతో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఒకరకంగా రామ్ చరణ్ కి అనధికార పీఆర్వోగా కూడా పనిచేస్తున్నారు. ఇక ఈ మధ్య ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న కొన్ని పోస్ట్స్ అయితే ఆమె తప్ప ఇంకెవరూ చేయరేమో అన్నట్టు పోస్ట్ లు చేసేవారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన పోస్ట్ మ్యారేజ్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

పెళ్లైన కొత్తలో అత్తవారింట్లో తనకు ఏమి తోచేది కాదట. రామ్ చరణ్ ఫ్యామిలీ గురించి తెలిసినా వాళ్లు సెలబ్రిటీలు కాబట్టి తనతో ఎలా బిహేవ్ చేస్తారో అని తెగ ఫీలయ్యేదాన్నని ఆమె చెప్పుకొచ్చింది. అత్త సురేఖ నన్ను కన్న కూతురిలా చూసుకుందని అందుకే అత్తరింట్లో ఉన్న విషయాన్ని మరిచిపోయినట్టు చెప్పుకొచ్చింది.  ఇక ఆన్‌స్క్రీన్ రామ్ చరణ్‌కి ఇంట్లో ఉండే రామ్ చరణ్‌కి చాలా తేడా ఉంటుందని అయితే అది సీక్రెట్ అని అది మాత్రం చెప్పనంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. అంతేకాక చరణ్, తాను భార్యాభర్తల్లా కాకుండా స్నేహితుల్లా ఉంటూనే ఒకరి వృత్తిని మరొకరం గౌరవిస్తామని ఆమె చెప్పుకొచ్చింది. అయితే పెళ్ళయిన కొత్తలో తన అందం గురించి మీడియాలో వచ్చిన కధనాలు చూసి బాధ పడ్డానని కానీ సానియా ఇచ్చిన సలహాలతో అలాంటివి అలవాటు అయ్యాయని చెప్పుకొచ్చారు. 

More Related Stories