వెంటిలేటర్ మీద డైరెక్టర్... కోన వెంకట్ క్లారిటీ

దర్శకురాలు సంజనా రెడ్డికి అస్వస్థత, ఆమె వెంటిలేటర్ మీద హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్టు సమాచారం అంటూ కొన్ని పత్రికలు ఈరోజు రాసుకోచ్చాయి. అయితే ఈ విషయం మీద క్లారిటీ వచ్చింది. జర్నలిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి రాజ్ తరుణ్‌తో `రాజుగాడు` సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన ఆమె ఆ తరువాత కరణం మల్లీశ్వరి బయోపిక్ ని తెరకేక్కిస్తున్నారు. తాజాగా ఆ సినిమా మీద అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక ఆమె ఆసుపత్రి వార్తలపై రచయిత కరణం బయోపిక్ నిర్మాత కోన వెంకట్ స్పందించారు. ఈ వార్తలను ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలని సంజన మూడు రోజులుగా లిక్విడ్ డైట్లో ఉన్నారని.. ఇంట్లో కళ్లు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్లో చేర్పించారని వెంకట్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు ఆమె నిన్న రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారని స్పష్టం చేశారు. కరణం మల్లేశ్వరి బయోపిక్కు సంబంధించి కూడా పనులు జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని కూడా కోన వెంకట్ చెప్పుకొచ్చారు. కరణం మల్లేశ్వరి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సమీపంలోని వూసవానిపేటలో జన్మించగా సంజన స్వస్థలం కూడా ఇదే ఊరు కావడం విశేషం.