English   

పోసాని ప్రెస్ మీట్ వెనుక ఇంత జరిగిందా..

Posani Krishna Murali
2020-06-10 14:00:12

సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి చానాళ్లుగా మీడియా ముందుకు రాలేదు. అప్పుడెప్పుడో ఆపరేషన్ చేయించుకున్న తరువాత కనిపించిన ఆయన అడపదపా ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ స్పెషల్ గా మీడియా ముందుకు అయితే రాలేదు. మరి ఎందుకొచ్చారో తెలీదు కానీ సడన్ గా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై వస్తున్న ఆరోపణలకు తానే ఆ ప్రభుత్వాలకి ప్రతినిధిలా ప్రతిపక్షాలకి కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రెస్ మీట్ లో పోసాని ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ లను వెనకేసుకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి విషయంలో అవగాహనతో అన్నదమ్ముల్లా పరిష్కరించుకునే విధంగా పరిపాలన చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏకైక అపోజిషన్ గా ఉన్న రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఆ తర్వాత ఏపీ విషయానికి వచ్చి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వం మీద చేసిన కామెంట్స్ మీద కూడా కామెంట్ చేశారు. అయితే ఎప్పుడూ లేనిది ఇలా రెండు ప్రభుత్వాల తరఫున ఇంత హడావిడిగా పోసాని ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం టాలీవుడ్ పెద్దలని అంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని తెలుగుదేశం పార్టీ అనే ముద్ర వేసేలా కార్నర్ చేస్తున్న కొన్ని పొలిటికల్ పార్టీలకు, లీడర్లకు చెక్ పెట్టడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఈ విధంగా పోసాని కృష్ణ మురళి ని తెర వెనక నుండి రెండు ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చే కామెంట్స్ చేయించినట్టు చెబుతున్నారు.  

More Related Stories