బాలయ్యకి ఎన్టీఆర్ శుభాకాంక్షలు..కళ్యాణ్ రామ్, రోహిత్ లు కూడా

ఈ రోజు నందమూరి నట సింహం బాలకృష్ణ 60వ పుట్టినరోజు. ఈ సందర్భంగా బాలయ్యకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక చానళ్ళ నుండి ఆయనకు అన్న కొడుకు ఎన్టీఆర్ కు పడదని రకరకాలుగా ప్రచారం జరిగేది. వాటికి బ్రేకులు వేస్తూ బాబాయి బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ సందర్భంగా తారక్ "నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య !" అంటూ ట్వీట్ చేశారు.
ఇక మరోపక్క తారక్ అన్న కళ్యాణ్ రామ్ కూడా బాలయ్యకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. "మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai " అంటూ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
ఇక నారా హీరో రోహిత్ కూడా బాలయ్యకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. "ప్రతి ఒక్కరినీ గౌరవించే గొప్ప వ్యక్తి, ఆధ్యాత్మికతతో, అత్యంత వినయంతో, నమ్రతతో ఉన్న వ్యక్తికి మీరు గొప్ప ఉదాహరణ. అలాగే పాము బుసలను, గొర్రెల అభిప్రాయాలను కనీసం పట్టించుకోని సింహానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు.