English   

మా బాలయ్యకి షష్టి పూర్తి శుభాకాంక్షలు...బ్రేకులేసిన చిరంజీవి

Chiranjeevi
2020-06-10 14:23:41

ఒకప్పుడు టాలీవుడ్ ను నలుగురు హీరోలు ఏలేవారు. వారే బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు. వారి మధ్య ఆరోగ్యకర పోటీ ఉండేది. అయితే ఈ మధ్య కరోనా వచ్చిన తరువాత బాలయ్య చిరంజీవిల మధ్య కొన్ని పొరపొచ్చాలు ఒచ్చాయి. తనని పిలవకుండా వెళ్లి కేసీఆర్ తో మీటింగ్ పెట్టుకుని రావడం ఆయనకు కోపం తెప్పించింది. ఆ విషయం మీద ఏదో కామెంట్ చేయడం, అది చాలా దూరమే తీసుకువెళ్ళింది. ఆ మీటింగ్ చిరు-బాల‌య్య ఫ్రెండ్‌షిప్‌కి బ్రేక్ వేసింద‌ని పుకార్లు ప్రచారం కాగా వాట‌న్నింటికి మెగాస్టార్ చిరంజీవి త‌న ట్వీట్‌తో చెక్ పెట్టాడు.

బాల‌కృష్ణ 60వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు. 60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. 60 ఏళ్ళ గ‌త స్మృతుల‌ని నేను గుర్తు చేసుకుంటున్నాను. హ్యాపీ బ‌ర్త్‌డే బాల‌కృష్ణ అంటూ చిరు ట్వీట్ చేశారు.

More Related Stories