English   

జగన్ తో భేటీకి బాలయ్య అందకే వెళ్ళలేదట...కుల రాజకీయం అంటూ 

Balakrishna
2020-06-10 14:37:52

నిన్న చిరంజీవి నేతృత్వంలోని కొంతమంది సినీప్రముఖులు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారన్న సంగతి తెలిసిందే. అజెండా ఏదయినా సరే కేసీఆర్ తో మీటింగ్ పెట్టుకుని తనని పిలవకపోవడం మీద బాలయ్య తీవ్రంగా స్పందించారు. దీంతో ఏమనుకున్నారో ఏమో జగన్ అపాయింట్మెంట్ దొరకగానే బాలయ్యను కూడా రమ్మని పిలిచారట. అయితే ఆ తరువాత రోజే తన పుట్టిన రోజు అని ఆయన రారన్నారని సీ కళ్యాణ్ ప్రకటించేశారు. అయితే ఈ సమావేశం మీద బాలయ్య తాజాగా స్పందించారు. 

ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం మీద స్పందించారు. జగన్ తో మీటింగ్ కోసం కేవలం ఒక వ్యక్తికి అపాయింట్ మెంట్ ఇచ్చారని.. అతడితో పాటు మరికొందర్ని తీసుకు రమ్మని లిస్టు రాసి ఇచ్చారని అలా ఒక వ్యక్తికి అపాయింట్ మెంట్ ఇచ్చి కొంతమందిని తీసుకు రమ్మంటే తను ఎలా వెళ్తానని ప్రశ్నించారు. అలాగే తాను చెప్పకుండా తాను రానని కూడా వాళ్లే ప్రకటించేశారని చెప్పుకొచ్చారు. 

అంతేకాక ఇండస్ట్రీలో గ్రూపులు ఎక్కువయ్యాయని, మరీ ముఖ్యంగా కుల సమీకరణాలు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. విశాఖలో స్టూడియోలు పెట్టలని భావించడం తప్పులేదన్న ఆయన వీరంతా టీడీపీ హయాంలో ఏమయ్యారని ప్రశ్నించారు. ఆ సమయంలోనే విశాఖలో స్టుడియో ఏర్పాటుకు భూమి-అనుమతి కావాలంటూ అప్లికేషన్ పెట్టుకున్నానని, ఈరోజు ఏదో వచ్చేసి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని పరోక్షంగా చిరంజీవిపై విమర్శలు గుప్పించారు బాలయ్య. 

More Related Stories