English   

నితిన్ సినిమాలో శిల్పా శెట్టి...టాలీవుడ్ రీ ఎంట్రీ 

Shilpa Shetty
2020-06-10 14:52:05

కుర్ర హీరో నితిన్‌ ప్రస్తుతం వరుస చిత్రాలని అనౌన్స్ చేసి మంచి ఫాంలో ఉన్నాడు. తాజాగా భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో భీష్మతో పాటే వెంకీ అట్లూరి, చంద్రశేఖర్‌ యేలేటి, కృష్ణ చైతన్యలతో సినిమాలు కూడా ఓకే చేశాడు. ఇక తాజాగా ఆయన మేర్లపాక గాంధీతో ‘అంధాదున్‌’ రీమేక్‌ కూడా పట్టాలెక్కించాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. నిజానికి ఈ సినిమాలో విలన్‌ ఓ లేడీ. హిందీ మాతృకలో ఈ పాత్రను టబు అద్భుతంగా నటించింది. 

తెలుగు రీమేక్‌లోనూ ఆ పాత్రను ఆమెతోనే చేయించాలని నితిన్ సినిమా యూనిట్ కూడా ప్రయత్నించగా ఈ పాత్ర చేయడానికి టబు కూడా అంగీకరించిందని కానీ, ఆమె అడిగిన రెమ్యునరేషన్ విన్నాకనే యూనిట్ షాకయిందని ప్రచారం జరిగింది. అయితే ఆమెను కాదని ఇలాంటి పాత్రను తెలుగులో ఎవరు చేస్తారా? అనే ప్రశ్న ఎదురయ్యింది. తాజాగా భూమిక పేరు ఈ పాత్రకు పరిశీలిస్తున్నారని కూడా అన్నారు.

ఇక ఈ సినిమాలో ఆ పాత్ర కోసం శిల్పాశెట్టిని అనుకున్నారని అంటున్నారు. ఆమె కూడా ఈ ప్రపోజల్ కి ఓకే అన్నట్టు చెబుతున్నారు. 2001లో బాలకృష్ణతో భలేవాడివి బాసు అనే సినిమా చేసిన ఆమె ఆ తరువాత తెలుగులో  మళ్ళీ నటించలేదు. ఇప్పుడు ఆమె ఈ సినిమాలో నటిస్తే మాత్రం టాలీవుడ్ రీ ఎంట్రీ అని చెప్పచ్చు.  

More Related Stories