English   

ఎన్టీఆర్ తో కలిసి నటిస్తానంటున్న బాలయ్య

Balakrishna
2020-06-10 16:14:07

నందమూరి అభిమానులు అందరూ ఎప్పటికీ ఎదురు చూసే విషయాలు రెండు ఉన్నాయి. అదేంటంటే నందమూరి ఫ్యామిలీ హీరోలు కలిసి నటించడం, అలాగే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి. ఇక బాలకృష్ణ పుట్టిన రోజు నేడు, ఆయన 60 ఏళ్ళ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన పుట్టిన రోజుని బంధు మిత్రుల సంక్షంలో కాస్త ప్రత్యేకంగా జరుపుకోబోతున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వూ లో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు బాలయ్య. 

తాజాగా ఎన్టీవీ ఇంటర్వ్యూ లో మీరు,జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్,తారకరత్న కలిసి నటిస్తే చూడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు మరి అలాంటి ఆలోచన మీకేమయినా ఉందా?” అని అడగగా దానికి బాలయ్య చాలా ఆసక్తి కరమయిన సమాధానం ఇచ్చారు.”మంచి కథ వస్తే ఖచ్చితంగా కలిసి నటిస్తామని కమర్షియల్ గా కాదని కానీ అందరం కలిసి నటిస్తున్నాం అంటే ఒక స్థాయి ఉంటుంది కదా.అందుకు తగ్గట్టే కథ బ్రహ్మాడంగా ఉండాలి. అలా ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తప్పకుండా చేస్తా”అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య. 

More Related Stories