English   

బాలకృష్ణ జన్మదిన వేడుకలకు చిరంజీవికి ఆహ్వానం లేనట్లేనా..

Balakrishna
2020-06-10 16:27:10

నాకు ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత ఎవరైనా.. ఆయన కంటే మంచి స్నేహితులు ఎవరూ లేరు అంటూ గతంలో బాలకృష్ణ చాలా సార్లు చెప్పాడు. గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నపుడు కూడా చిరంజీవి సినిమా విజయం సాధించాలని మనసారా కోరుకున్నాడు బాలయ్య. అంతే కాదు చిరంజీవి షష్టిపూర్తి వేడుకలతో పాటు.. ఆయన ఇంట్లో జరిగిన ఫంక్షన్లలో కూడా బాలయ్య వచ్చి డాన్సులు కూడా చేసాడు. అయితే ఇప్పుడు తన జీవితంలో జరుగుతున్న 60వ జన్మదిన వేడుకలకు చిరంజీవికి ఆహ్వానం అందలేదని ప్రచారం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో బాలయ్యను కావాలనే కొందరు దూరం పెడుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకే ఇండస్ట్రీ కోసం జరుగుతున్న మీటింగ్స్ విషయంలో కూడా బాలయ్య దూరంగా ఉంటున్నాడు.. నిజానికి ఆయన దూరంగా ఉంటున్నాడు అనేకంటే ఆయనను దూరంగా ఉంచుతున్నారు అనడం భావ్యంగా ఉంటుంది. తెలంగాణలో జరిగిన ఏ మీటింగ్ కు కూడా బాలయ్య కు ఆహ్వానం అందలేదు. ఇక జగన్ మోహన్ రెడ్డితో జరుగుతున్న మీటింగ్ కు పిలిచినా కూడా ఆయన జన్మదిన వేడుకల కారణంగా వెళ్లడం లేదు. ఇదిలా ఉంటే జూన్ 10న తన ఇంట్లోనే 60వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోబోతున్నాడు బాలకృష్ణ. దీనికి ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం రావడం లేదని ప్రచారం జరుగుతుంది. దానికి కారణం బాలకృష్ణ నుంచి ఆయనకు ఆహ్వానం అందకపోవడమే. తనను దూరం పెడితే తాను కూడా దూరం పెడతానని బాలయ్య స్టేట్మెంట్లు ఇస్తున్న తరుణంలో ఈ జన్మదిన వేడుకలో చిరంజీవి కనిపించడం కష్టమే అంటున్నారు అభిమానులు కూడా. మరి ఈ వైరం ఎంత దూరం వెళుతుందో చూడాలి. 

More Related Stories