English   

బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్టులు ఏంటో తెలుసా..

Balakrishna
2020-06-11 07:44:15

45 ఏళ్ల నట జీవితంలో వంద సినిమాలు పూర్తి చేశాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికీ అదే జోరు చూపిస్తూ ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాల వరకు పూర్తి చేస్తానంటున్నాడు. అన్నీ కుదిరితే ఒక ఏడాది మూడు సినిమాలు విడుదల చేయడానికి కూడా బాలయ్య వెనకాడటం లేదు. ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు నందమూరి వారసుడు. తాజాగా ఆయన 60వ జన్మదినం కూడా జరుపుకున్నాడు. షష్టిపూర్తి సందర్భంగానే తన కలల ప్రాజెక్ట్ ల గురించి చెప్పుకొచ్చారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటివరకు ఎన్నో సంచలన పాత్రలు చేసిన ఈయన.. మరో మూడు సినిమాలు చేయాలని ఆరాటపడుతున్నాడు. 

తన కెరీర్ ముగిసే లోపు ఖచ్చితంగా ఆ మూడు సినిమాలు కూడా చేస్తాను అంటున్నాడు. బాలయ్య మనసు దోచిన ఆ మూడు సినిమాలు ఏంటో తెలుసా.. ఎప్పటి నుంచో ఆయన కలలుగన్న ఆదిత్య369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ అందులో ఒకటి. సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నాడు. దాంతోపాటు రుద్రమదేవి కాలంలో రాబిన్ హుడ్ బందిపోటుగా పేరున్న గోన గన్నారెడ్డి పాత్ర చేయాలనేది తన కల అంటున్నాడు బాలయ్య. ఇక దాంతోపాటు చంగిస్ ఖాన్ పాత్ర కూడా తను చాలా ప్రభావితం చేసింది అని చెప్పాడు బాలయ్య. ఈ మూడు సినిమాలు కచ్చితంగా చేస్తానంటున్నాడు. అవి ఎప్పటికి నెరవేరుతాయో చెప్పలేము కానీ కచ్చితంగా ఈ మూడు సినిమాలు అయితే చేస్తాను అని బల్ల గుద్ది మరీ చెప్పాడు బాలయ్య. 

More Related Stories