English   

మీరంతా హీరోలు కాదు జీరోలు.. విరుచుకుపడ్డ సాధినేని యామిని..

Yamini Sadineni
2020-06-11 07:57:50

మీరు అసలు మనుషులేనా.. సినిమాల్లో చెప్పిన నీతులు ఎక్కడికి పోయాయి.. నిజమైన హీరోల సినిమాల్లో త్యాగాలు చేస్తుంటారు.. కానీ నిజజీవితంలో మాత్రం కేవలం నటించడానికి మాత్రమే పనికొస్తారు.. కళ్ళముందు మనుషులు చచ్చిపోతున్న పట్టించుకోని మానవత్వం లేని మనుషులు మీరు అంటూ టాలీవుడ్ హీరోలపై నిప్పులు జరిగింది సాధినేని యామిని. మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉన్న ఇప్పుడు బిజెపిలో చేరిపోయింది. ఇక తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చిన టాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేసింది సాధినేని యామిని. మరీ ముఖ్యంగా చిరంజీవిని ఓ రేంజ్ లో విమర్శించింది.

ఖైదీ నెంబర్ 150 సినిమాలో రైతులపై అన్ని డైలాగులు చెప్పావు.. వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని నానా రచ్చ చేశావు.. మరి నిజ జీవితంలో ఎందుకు రైతుల కష్టాలు నువ్వు పట్టించుకోవడం లేదు చిరంజీవి అంటూ ఆమె నిలదీసింది. అదంతా కేవలం నటన మాత్రమే.. కేవలం నీ పబ్బం గడిస్తే చాలు.. ప్రజలు చచ్చిపోయినా పర్లేదు అనుకునే మనస్తత్వం మీది.. నీకు మీ సినిమాలు ఆడితే చాలు.. అందుకే మీరు నిజజీవితంలో జీరోలు అంటూ ఫైర్ అయిపోయింది. అమరావతిలో రైతులు తమ ఆందోళన తెలియజేస్తే కనీసం వాళ్ళ పట్టించుకోకుండా వెళ్లిపోయారు.. ఇదెక్కడి మానవత్వం అంటూ ప్రశ్నించింది సాధినేని యామిని.

మీకు మీ బిజినెస్ కావాలి.. మీ సినిమాలు బాగా ఆడాలి.. బయట ప్రజల కష్టాలు మాత్రం మీరు పట్టించుకోరు. ఎంతసేపు మీరు మీ కుటుంబాలు బాగుంటే చాలు మిగిలిన వాళ్ళు ఏమైపోయినా మీకు పర్వాలేదు అంటూ మండిపడింది యామిని. ఆయనతో పాటు వచ్చిన నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్ లాంటి సినిమా పెద్దలపై కూడా యామిని విమర్శల వర్షం కురిపించింది. 

More Related Stories