English   

చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలపై బాలకృష్ణ హాట్ కామెంట్స్..

Balakrishna
2020-06-11 09:17:09

వెన్నుపోటు.. ఈ పదం వినగానే మనకు తెలియకుండానే చంద్రబాబు నాయుడుతో పాటు సీనియర్ ఎన్టీఆర్ పేరు కూడా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆయనను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నాడు అంటూ ఎప్పుడు చంద్రబాబుపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణ. ఆయన ఎంత అభివృద్ధి చేసినా.. రాజకీయంగా ఎంత పలుకుబడి సంపాదించినా.. ముఖ్యమంత్రిగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కూడా ఆయన మొత్తం రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడు అని మచ్చ మాత్రం పోగొట్టుకోలేకపోయాడు. ఆ నిందను ఇప్పటికీ మోస్తూనే ఉన్నాడు చంద్రబాబు. ఆ రోజు ఏం జరిగింది అనేది ఇప్పటికీ ఎవరూ సరిగా చెప్పలేరు. కానీ సీనియర్ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం చంద్రబాబు నాయుడు లాగేసుకున్నాడు అంటూ ఆయన ప్రత్యర్ధులు ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటారు. దానికి సాక్ష్యంగా అప్పట్లో ఎన్టీఆర్ చెప్పిన ఒక వీడియోను చూపిస్తుంటారు. నందమూరి వారసులతో పాటు మిగిలిన వాళ్ళను కూడా అడ్డం పెట్టుకుని సొంత వాళ్లతోనే సీనియర్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు అని చంద్రబాబును అంతా తిట్టి పోస్తుంటారు.

ఇక ఇప్పుడు ఇవే కామెంట్స్ బాలకృష్ణ దగ్గరికి కూడా వచ్చాయి. తాజాగా ఆయన జన్మదిన సందర్భంగా అన్ని మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు బాలయ్య. అందులో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఆయన ముందుకు వచ్చాయి. అలాంటిదే చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం. అప్పట్లో మీ తండ్రి గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అంటారు.. దీనిపై మీ కామెంట్ ఏంటి బాలకృష్ణ గారు అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పాడు బాలయ్య. చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.. గాడిద గుడ్డు అని చాలా మంది అంటుంటారు. అలాంటివి తనకు తెలియదు.. ఈ రోజుకు ఆ పార్టీని అందరం కలిసి బతికేస్తున్నాం.. ముందుకు తీసుకొస్తున్నాం.. అలాగే విజయం కూడా సాధించాం అంటూ సమాధానం ఇచ్చాడు బాలయ్య. అంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ నుంచి పగ్గాలు లాగేసుకోవడమే కరెక్ట్ అని బాలయ్య కూడా ఫీల్ అయినట్లు ఆయన సమాధానంలో అర్థమవుతుంది. అంతేకాదు తన తండ్రి తరవాత అంత క్రమశిక్షణ చంద్రబాబు నాయుడులో మాత్రమే తాను చూశానని చెప్పాడు బాలకృష్ణ. 

More Related Stories