English   

రానా పెళ్లి చెప్పిన టైంకే...వాయిదాలు ఏవీ లేవట

Rana Daggubati
2020-06-11 12:13:58

హీరో రానా మిహీకా బజాజ్ ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి అభిమానులతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచాడన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లి కూడా ఖరారు అయింది. ఈ క్రమంలో గత నెల 21న రానా మిహికా బజాజ్ల రోకా వేడుక కూడా చేసుకున్నారు. ఇక నిశ్చితార్ధం కూడా జరగాల్సి ఉంది. ఇక నిశ్చితార్ధం జరగక ముందే ఆగస్ట్ 8న వీరి పెళ్లి ఉంటుందని సురేష్ బాబు ప్రకటించారు. అయితే ఈ మధ్య ఈ పెళ్లి వాయిదా పడ్డట్టు వార్తలు ప్రచారం అయ్యాయి. లాక్డౌన్ పెట్టిన సమయంలో కరోనా కేసుల నియంత్రణ బానే ఉన్నా ఇప్పుడు లాక్ డౌన్ కి సడలింపులు ఇవ్వడంతో పరిస్థితి చేయి దాటి పోయింది. దీంతో ఇరువురికి చెందిన కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి వీళ్ల పెళ్లి వాయిదా వేస్తున్నట్టు ఆ ప్రచారం సాగింది. దీంతో రానా పెళ్లి పై వాయిదా అంటూ వస్తున్న పుకార్ల పై దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించింది. పెళ్లి వాయిదా అనేది నిజం కాదని, అనుకున్న ముహుర్తానికే ఆగష్టు 8న రానా మిహీకల పెళ్లి జరుగుతుందని సురేష్ బాబు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.  

More Related Stories