English   

రెండేళ్ళ క్రితం ఆగిన నాగార్జున ధనుష్ మల్టీస్టారర్ కి మోక్షం 

Nagarjuna Dhanush
2020-06-11 12:29:43

నాగార్జున న‌టించిన ఊపిరి, దేవ‌దాస్ లాంటి మ‌ల్టీ స్టార‌ర్ ల‌కి మంచి క్రేజ్ తో పాటు కలెక్షన్ లు కూడా బానే రావ‌డంతో ధ‌నుష్‌ తో క‌లిసి మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడని రెండేళ్ళ క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్ తో పాటు మరికొన్ని భాషల్లోకి ఒకేసారి నిర్మించాలని భావిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున‌తో పాటు ఎస్‌జే సూర్య‌, అదితిరావు, ధ‌నుష్‌ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని ఆ సినిమాకి ధనుష్ దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే  ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘నాన్ రుద్రన్’ తెలుగులో రుద్ర భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రారంభించాడు. 

అయితే కొన్ని పరిస్థితుల్లో ఆ సినిమా ఆగిపోయింది.  ఈ చిత్రాన్ని తమిళంలో 100కు పైగా సినిమాలు నిర్మించిన తేనాన్డాల్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉండగా సదరు సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడమే కారణం అని అంటున్నారు. ఈ సంస్థే రూ.300 కోట్ల బడ్జెట్ తో ‘సంఘమిత్ర’ చిత్రాన్ని కూడా నిర్మించాలనుకుంది. కానీ ఆర్థిక సంక్షోభంలో పడి ఆ సినిమాను ఆపేసింది. దీంతో పాటుగా ‘రుద్ర’ విషయంలోనూ చేతులేత్తేసిందట. 

ప్రస్తుతం ఇంకో నిర్మాతను చూసుకుని సినిమా మొదలుపెట్టే పరిస్థితి లేకపోవడంతో ధనుష్ తాత్కాలికంగా ఆ సినిమాను ఆపేశాడని అన్నారు. అయితే ఇప్పుడు ఈ ఆ ప్రాజెక్టును మళ్లీ సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట ధనుష్. కొంచెం బడ్జెట్ తగ్గించి ప్లాన్స్ వేసి.. సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ ని కొత్తగా రెడీ చేసేందుకు ధనుష్ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.

More Related Stories