క్రేజీ మల్టీస్టారర్ లో రానా, రవితేజ

టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్ లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్ లేని వారు అంతా అదే బాట పడుతున్నారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటంతో ఈ రెండూ కలిసి ఉన్న సినిమా చేయడానికి కూడా హీరోలు సిద్ధమైపోతున్నారు. మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాను రీమేక్ చేయడం కోసం నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలో అగ్ర హీరో అయిన పృథ్వీరాజ్ నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నాడన్న ప్రచారం అయితే జరుగుతోంది. మరో పాత్ర కోసం ఓ యంగ్ హీరో అవసరం కావడంతో రానా అనే పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది.
అయితే ఈ సినిమాలో తాను నటించడం లేదని తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడీ కథ కోసం రవితేజ, రానాలను ఫైనల్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇందులో ఇన్స్పెక్టర్ గా రానా, రవితేజలలో ఎవరు నటిస్తారు? అన్న దాన్ని బట్టి ఆయా పాత్రల్లోనూ చాలా మార్పులు చెయ్యాల్సి ఉంటుందని అంటున్నారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేశాక ఈ రీమేక్ విషయమై ఓ స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా మార్పులు చేర్పులతో సినిమాని తెరకేక్కించాల్సి ఉంది. మరి ఈ బాధ్యత ఏ దర్శకుడు అందుకుంటారు అనేది ఆసక్తి కరంగా మారింది.