English   

నితిన్ సరసన ఇస్మార్ట్ భామ 

Nithiin
2020-06-11 16:01:41

కుర్ర హీరో నితిన్‌ ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేసి మంచి ఫాంలో ఉన్నాడు. తాజాగా భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో భీష్మతో పాటే వెంకీ అట్లూరి, చంద్రశేఖర్‌ యేలేటి, కృష్ణ చైతన్యలతో సినిమాలు కూడా ఓకే చేశాడు. ఇక తాజాగా ఆయన మేర్లపాక గాంధీతో ‘అంధాదున్‌’ రీమేక్‌ కూడా పట్టాలెక్కించాడు. మొన్నామధ్య పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది కూడా. అయితే లాక్‌డౌన్‌ కారణంగా రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం జరగడం లేదు. ఇక ఈ సినిమాలో విలన్‌ ఓ లేడీ. మాతృకలో ఈ పాత్రను టబు అద్భుతంగా నటించింది. అందుకే ఇప్పుడు తెలుగు రీమేక్‌లోనూ ఆ పాత్రను ఆమెతోనే చేయించాలని నితిన్ సినిమా యూనిట్ కూడా ప్రయత్నించినట్లు అయితే రెమ్యునరేషన్ కుదరక వదిలేశారని అన్నారు.

అయితే ఆ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ శిల్పా శెట్టి నటించనుందని అంటున్నారు. ఆ విషయం అలా ఉంచితే తాజాగా ఈ చిత్రంలో నితిన్‌ సరసన నటించే నాయిక గురించి ప్రచారం సాగుతోంది. ‘గ్యాంగ్‌ లీడర్‌’ ఫేం ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ను ఎంపిక చేసే ఆలోచనలో యూనిట్ ఉందని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ పాత్ర కోసం ఇస్మార్ట్ భామ నభా నటేష్ ని సంప్రదించారని అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నభా నటేష్, అటు గ్లామర్ పరంగానూ, నటన పరంగానూ మంచి మార్కులు తెచ్చుకుంది. అందుకే నితిన్ తో అంధాధున్ తెలుగు రీమేక్ లో నటించడానికి నభా నటేష్ ని సంప్రదించారని అంటున్నారు. 

More Related Stories