చిరుతో రానా..ఆ సినిమా కోసమేనట

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా బాగా లేటయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు చిరంజీవి. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్, బాబీ అలాగే సుజీత్ తో కథా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా. సుజీత్ కి ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ పై ప్రస్తుతం సుజీత్ పని చేస్తున్నారు. దీనిని పూర్తి స్థాయి తెలుగు సినిమాగా తీర్చి దిద్దే పనిలో పడ్డాడట సుజీత్.
ఇక డైరెక్టర్ బాబీ తనకు చెప్పిన కధ నచ్చిందని ఆ సినిమా చేస్తున్నామని చిరు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు బాబీ డైరెక్ట్ చేయబోయే సినిమా ఓ మల్టీస్టారర్ సబ్జెక్ట్ అట. అయితే ఈ సినిమాలో చిరంజీవితో రానా దగ్గుబాటి నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే రానా నటించబోయేది బాబీ సినిమా కాదని లూసిఫర్ రీమేక్ లోనే అని అంటున్నారు. లూసీఫర్ రీమేక్‌లో పృథ్వీరాజ్ చేసిన పాత్రకు రానా అయితే సరిపోతాడని చిరు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకు రానా కూడా ఒప్పుకున్నాడని అంటున్నారు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది లూసీఫర్ తెలుగు రీమేక్ పట్టాలెక్కనుంది. ఇక ఆ ఏడాది చివరిలోనే విడుదల చేయాలని చూస్తున్నారు.