English   

గోపీచంద్ వద్దనుకున్న సినిమా చేస్తున్న రానా

Gopichand
2020-06-11 16:16:15

నీది నాదీ ఒకే కధ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి లీడ్ రోల్స్ లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా సాయి పల్లవి నక్సలైట్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో తన పాత్రలో ఈజ్ కోసం రానా రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకునున్నాడని కూడా ప్రచారం జరిగింది. 

సాయి పల్లవి పాత్ర ఏమో జానపద గీతాలు పాడుతూ ప్రజలను చైతన్య పరిచే యువతిగా ఉంటుందట. ఆ విషయాలు పక్కన పెడితే ఈ సినిమాలో హీరోగా చేయమని తొలుత మ్యాచో స్టార్ గోపీచంద్‌ ను డైరెక్టర్ సంప్రదించినట్లు చెబుతున్నారు. కానీ ఆ సమయంలో గోపీచంద్ వరుస సినిమాలు ఒప్పుకుని ఉండడంతో ఆ సినిమా కధ నచ్చినా డేట్స్ అడ్జెస్ట్ చేయలేక విరాటపర్వం చిత్రాన్ని రిజెక్ట్ చేశాడట. ఇప్పటికే వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న గోపీ ఇలాంటి సినిమా చేసుంటే బాగుండేదని అంటున్నారు.  

More Related Stories