English   

ఈ పుట్టినరోజు నిజంగా ఇలా జరిగి ఉంటే ఎంత బాగుండేదో..

balakrishna
2020-06-11 19:23:20

ఇలాంటి ఫోటోలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది కదా.. నిజంగానే ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ ఒకదగ్గర చేరి బాలయ్య పుట్టిన రోజు జరిపి ఉంటే అది నిజంగా అద్భుతంగా ఉండేది. చరిత్రలో మిగిలిపోయేది. ఐదేళ్ల కింద చిరంజీవి 60 వ జన్మదిన వేడుకలు ఇలాగే జరిగాయి. ఈ దేశంలో ఉన్న సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలకు వచ్చారు. కానీ బాలకృష్ణ విషయంలో మాత్రం అది జరగలేదు. ఆయన పుట్టిన రోజు వేడుకలకు ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాలేదు ఆయన ఆహ్వానం పంపలేద లేదంటే లేదా అనేది పక్కన పెడితే బాలయ్య షష్టిపూర్తి వేడుకలు మాత్రం బసవతారకం హాస్పిటల్ లో నిరాడంబరంగా జరిగాయి.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఒక ఫోటో మాత్రం ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. బాలకృష్ణ పుట్టిన రోజును ఇండస్ట్రీలో ఉన్న చిన్నా పెద్ద స్టార్ హీరోలు అందరూ కలిసి ఒకే దగ్గర చేరి జరిపినట్లు ఒక ఫోటో వైరల్ అవుతుంది. చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఈ ఫోటోలో కూర్చుని ఉంటే మిగిలిన అందరూ నిలబడి ఉన్నారు. ఇది ఒక యానిమేషన్ పిక్చర్. ఊహాజనితమైన బొమ్మ చూడటానికి ఇంత అద్భుతంగా ఉంటే అది ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఎంత అద్భుతంగా ఉండేదో అంటున్నారు అభిమానులు. కాని కొన్ని ఊహలు మాత్రమే వుంటాయి.. అవి నిజం కావాలంటే అంత ఈజీ కాదు. బాలయ్య పుట్టిన రోజు విషయంలో కూడా ఇదే జరిగింది. 

More Related Stories