English   

ఎవడు పడితే వాడు దాసరి ప్లేస్ భర్తీ చేయలేడంటున్న బాలయ్య..

Dasari Narayana Rao
2020-06-12 08:03:33

తెలుగు ఇండస్ట్రీలో మహానుభావులు చాలా తక్కువగా ఉన్నారని.. ఎవడు పడితే వాడు తాను మహానుభావుడు అనుకోవడం మంచిది కాదు అంటున్నాడు నందమూరి బాలకృష్ణ. లెజెండ్స్ అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని.. అనవసరంగా తమను తాము లెజెండ్స్ అనే ఊహలో కొందరు బతికేస్తుంటారు అని సెటైర్లు వేశాడు బాలయ్య. పక్కనున్న వాడు భజన చేస్తుంటే నిజంగానే వాడు కూడా లెజెండ్ అయిపోయాడు ఏమో అని భ్రమపడుతుంటారని ఇండస్ట్రీలో కొందరికి చురకలు అంటించాడు నందమూరి బాలకృష్ణ. 

ఇదిలా ఉంటే దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా బాలయ్య కామెంట్ చేశాడు. ఆయన చనిపోయి మూడేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఆ స్థానం అలాగే ఉందని దాన్ని ఎవరూ భర్తీ చేయలేదని చెప్పాడు. దాసరి స్థానం భర్తీ చేసే మొనగాడు ఇండస్ట్రీలో ఎవరూ లేరు అంటూ కుండబద్దలు కొట్టాడు బాలకృష్ణ.

కొందరు బలవంతంగా ఆ స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నించినా కూడా అది కుదరని పని అని.. దాసరి స్థానం భర్తీ చేయగల సత్తా ఉన్న వాళ్లు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ లేరు అని చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. అనవసరంగా అలాంటి ఊహలు పెట్టుకుంటే అందరి ముందు పిచ్చోడు అవుతారు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు బాలయ్య. ఇది ఆయన ఎవరిని ఉద్దేశించి చేసాడు అనేది అందరికీ అర్థమయ్యే విషయమే. 

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి అన్నింటా ముందు కనిపిస్తున్నాడు. ప్రభుత్వంతో చర్చల విషయం కానీ మిగిలిన ఏ విషయం కానీ చిరంజీవి ముందు కనిపిస్తున్నాడు. దాసరి స్థానాన్ని కాస్తైనా ఆయన భర్తీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్నింట్లోనూ చిరంజీవి పేరు ముందు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాసరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ ఆసక్తి పుట్టిస్తున్నాయి. మరి ఈ గొడవలు ఇంకా ఎంత స్థాయికి వెళ్లిపోతాయో చూడాలి. 

More Related Stories