English   

అన్నయ్య పుట్టినరోజును టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్..

pawan kalyan
2020-06-12 08:24:53

చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య రిలేషన్ గురించి కొత్తగా చెప్పడానికేం ఉంది. అన్నయ్యే తనకు దేవుడు అంటాడు పవన్. తమ్ముడు కాదు వాడు నా పెద్ద కొడుకు అంటాడు చిరంజీవి. ఈ ఇద్దరూ వీలు దొరికిన ప్రతీసారి తమ ప్రేమను ప్రపంచానికి కూడా చూపిస్తూనే ఉంటాడు. ఇక ఇప్పుడు అన్నయ్య పుట్టిన రోజుకు అభిమానులకు పవన్ అదిరిపోయే కానుక సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. ఈయన ప్రస్తుతం నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. నిజానికి కరోనా లేకపోయుంటే ఈ పాటికే సినిమా విడుదలై ఉండేది. మే 15న విడుదల చేస్తామని చెప్పాడు నిర్మాత దిల్ రాజు. దానికి తగ్గట్లుగానే సినిమా షూటింగ్ కూడా వేగంగానే పూర్తి చేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే అనుకోకుండా లాక్ డౌన్ వచ్చి అంతా నాశనం చేసింది. 

జూన్ మొదటి వారం నుంచి షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వీలైనంత త్వరగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ పాటిస్తూ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. పది రోజుల్లోనే మిగిలిన షూట్ పూర్తవుతుందని దర్శకుడు వేణు శ్రీరామ్ ఇప్పటికే చెప్పాడు. దాంతో జులై అంతా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజున వకీల్ సాబ్ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే కానీ జరిగితే మెగా అభిమానులకు అంతకంటే పండగ మరోటి ఉండదు. అయితే కరోనా నేపథ్యంలో థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా ఆడియన్స్ ఎంతవరకు వస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.  

More Related Stories