మోక్షజ్ఞకు అసలు హీరో అనే ఉద్దేశం ఉందా లేదా..

నందమూరి బాలయ్య వారసుడు అన్నపుడు సినిమాల్లోకి రాకుండా ఎలా ఉంటాడు.. అసలు రాడని ఎలా అనుకుంటారు.. అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఎప్పుడెప్పుడు బాలయ్య వారసుడు వస్తాడా అని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మోక్షజ్ఞ మాత్రం సినిమాలంటే ఆసక్తి లేనట్లుగా కనిపిస్తుండటం ఇప్పుడు ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. దాంతో పాటు ఇప్పుడు ఆయన లుక్ కూడా వాళ్లను భయపెడుతుంది. పూర్తిగా లుక్ మార్చేసి.. లావుగా మారిపోయాడు మోక్షు. హీరోకు కావాల్సిన ఒక్క లక్షణం కూడా ఈయనలో కనిపించడం లేదు. దానికి తోడు కనిపిస్తున్న పొట్ట కూడా అభిమానులను భయపెడుతుంది. దాంతో ఇప్పుడు ఇదే సంచలనంగా మారిపోయింది. తాజాగా బాలయ్య పుట్టినరోజు వేడుకల్లో కనిపించాడు నందమూరి వారసులు. అందులో మోక్షజ్ఞ పిక్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మోక్షజ్ఞ 2022లో కాదు.. అసలు హీరోగా మారే అవకాశాలే కనుమరుగు అవుతున్నాయి. ఈయనకు సినిమాలు అంటే పెద్దగా ఆసక్తి లేదనే విషయం బయటికి వచ్చింది. ఇది తెలిసిన తర్వాత బాలయ్యతో పాటు ఫ్యాన్స్ కూడా షాక్ అవ్వక తప్పదు.
ఎందుకంటే నటనే ఊపిరిగా ఉండే నందమూరి వంశంలో నటన అంటే ఆసక్తి లేకపోవడం నిజంగా విడ్డూరమే. అయితే మోక్షజ్ఞ మనసు మార్చేందుకు చాలా ప్రయత్నాలే జరుగుతున్నట్లు తెలుస్తుంది. అందరి మాటలు విని మోక్షజ్ఞ అసలు సినిమాలు చేస్తాడా అనేది ఆసక్తికరమే. ఇప్పటికీ అదే బరువుతో ఉన్నాడు మోక్షు. అయితే అనుకుంటే బరువు తగ్గడం పెద్దగా విషయం కాదేమో కానీ సినిమాలంటే ఆసక్తి లేనపుడు ఫిజిక్ ఎలా ఉంటే ఏంటి అనేది మోక్షజ్ఞ ఫీలింగ్ అని సన్నిహితులు చెబుతున్న మాట. నటన కంటే కూడా నందమూరి వారసుడు బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సిటీలోనే కాఫీ షాప్ బిజినెస్ పెట్టాలనేది నందమూరి మోక్షజ్ఞ ఐడియా అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై బాలకృష్ణ కూడా ఏమీ మాట్లాడటం లేదు. మొత్తానికి ఏదేమైనా బాలయ్య వారసుడు వస్తాడు.. వచ్చి రప్ఫాడిస్తాడు అని వేచి చూస్తున్న అభిమానులకు మోక్షజ్ఞ మాటలు మాత్రం విచిత్రంతో పాటు విస్మయాన్ని కూడా కలిగిస్తున్నాయి. మరి చూడాలిక.. చివరి వరకు మోక్షజ్ఞ కల ఏమవుతుందో..?