English   

యాడ్స్ వచ్చినా బాలకృష్ణ ఎందుకు నటించలేదో తెలుసా..

Balakrishna
2020-06-12 18:13:41

తెలుగు ఇండస్ట్రీలో హీరోలు సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలు కూడా సమాంతరంగా చేస్తుంటారు. అక్కడ ఇక్కడ రెండు చేతులా సంపాదిస్తున్నారు మన హీరోలు. కాస్త పాపులారిటీ రాగానే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతుంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో చాలా వరకూ ఎండార్స్మెంట్ చేస్తున్నారు. నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో సహా చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా అందరూ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.. యాడ్స్ లో నటించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి మానేసినా అదే కుటుంబం నుంచి వచ్చిన రామ్ చరణ్ వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. నందమూరి వంశం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కూడా యాడ్స్ చేస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ మాత్రం ఇప్పటివరకు ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా కనిపించలేదు. దానికి కారణం కూడా ఉంది. 

కెరీర్ లో ఎన్నో సార్లు ఎన్నో కంపెనీలు తమ బ్రాండ్స్ కు ప్రమోట్ చేయమని బాలయ్యను అడిగారు. కానీ ఆయన మాత్రం ఒక్కసారి కూడా ఎస్ చెప్పలేదు. దానికి కారణం ఆయన తండ్రి నందమూరి తారకరామారావు చూపించిన దారి. మనకు ఇంత పాపులారిటీ తీసుకొచ్చిన ప్రజల గురించి ఆలోచించాలి అంతే కానీ  దాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం కంటే దారుణం మరొకటి లేదు అని ఎన్టీఆర్ ఎప్పుడు భావించేవాళ్ళు. అందుకే తాను కూడా అదే దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు బాలయ్య తెలిపాడు. ఆ కారణంతోనే తన కెరీర్ లో ఎప్పుడూ కమర్షియల్ యాడ్స్ లో నటించలేదు. ఈ విషయంలో తన పని తాను ఎప్పటికీ తన పంథా మార్చుకోను అంటున్నాడు బాలయ్య. రేపు తన వారసుడు మోక్షజ్ఞ వచ్చినా కూడా కమర్షియల్ యాడ్స్ విషయంలో అదే నిర్ణయంతో ఉంటాడని నమ్ముతున్నాడు బాలకృష్ణ. 

More Related Stories