English   

కోవిడ్ రూల్స్ తో మాక్ షూట్ చేయనున్న రాజమౌళి 

 Rajamouli
2020-06-12 11:29:19

గత రెండు నెలలుగా కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి. లాక్ డౌన్ 5 నేపధ్యంలో అనేక సడలింపులు ఇస్తున్నారు. ఆ సడలింపులు బేస్ చేసుకొని ఇప్పటికే  కార్యాలయాలు, షాపులు, మార్కెట్లు ఓపెన్ అయ్యాయి.  దేవాలయాలు కూడా ఓపెన్ అయ్యాయి. సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే టాలీవుడ్ కి షూటింగ్స్ చేసుకోడానికి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చేసినా ఇప్పట్లో సినిమాలు పట్టాలు ఎక్కే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. ఎందుకంటే అనుమతులు ఇచ్చినా అనేక రూల్స్ పెట్టి మరీ అనుమతులు ఇస్తున్నారు.

ఆ అనుమతులలో ముఖ్య మైన నియమాలు ఏంటంటే భౌతిక దూరం ఉండాలి సెట్ మొత్తాన్ని శానిటైజ్ చేసుకోవాలి.. ఎక్కువ మంది షూట్ లో ఉండకూదు.. ఎక్కువగా ఇన్‌ డోర్ షూటింగ్ కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అరవై ఏళ్ళు దాటినా వారికి ప్రవేశం లేదు లాంటి నియమాలు చాలానే ఉన్నాయి. అందుకే తెలుగు వాళ్ళు కరోనా మీద ఒక క్లారిటీ వచ్చే వరకూ షూటింగ్స్‌ కు వెళ్ళలేమని నిర్మాతలు చెబుతున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ క్రమంలో తాము షూటింగ్‌కు రాలేమని చెబుతున్నారట నటీనటులు. అందుకే ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి మాక్ షూట్ చేయబోతున్నారని అంటున్నారు. 

యాభై మంది క్రూతో ఆర్ఆర్ఆర్ మాక్ షూట్ ను రేపు అంటే శనివారం ప్లాన్ చేసారని అంటున్నారు. దాదాపు 200 మందికి పైగా చేయాల్సిన షూట్ ను యాభై మందితో చేయాలి. కరోనా జాగ్రత్తలు తీసుకోవడంతో ఇలా మూడో వంతు మందితో షూట్ చేయడం వలన ప్రాక్టికల్ ప్రోబ్లమ్స్ ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ మాక్ షూట్ చేస్తున్నారు. రేపు కుదరకుంటే సోమవారం ఈ షూట్ చేసి తీసిన ఫుటేజ్ ను ఇరు ప్రభుత్వాలకు పంపే చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మాక్ షూట్ ని ఒకరిద్దరు అగ్ర దర్శకులు పర్యవేక్షిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఈ రూల్స్ అన్నీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తయారుచేసి ఇచ్చిందని, ముందు స్టార్ట్ చేసి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిబంధనలు సడలించుకోవచ్చని గిల్డ్ అభిప్రాయ పడిందని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ? 

More Related Stories