English   

షూటింగ్స్ కి అనుమతిచ్చినా ఆర్ఆర్ఆర్ డౌటే 

 RRR
2020-06-12 13:38:36

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ప్రారంభించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. తెలుగు నాడు నుండో స్వతంత్రం కోసం పోరాడిన వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవిత కథలను కలుపుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏ ముహూర్తాన ప్రారంభించారో ఎప్పుడూ ఏవో ఒక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఇక రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది. ఇప్పటికే ఇప్పటికే 80 శాతం మేర ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. 

అయితే ఈ సినిమాకి కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. అయినా ఎలా అయినా ఆర్ఆర్ఆర్ డేట్ అనౌన్స్ చేసిన నాటికి రిలీజ్ చేయడానికి గట్టి ప్రయత్నంలో ఉన్నారు. ఐతే కరోనా వలన విధించిన లాక్ డౌన్ వలన ఇప్పట్లో విదేశాల నుండి వచ్చే ఫ్లైట్స్ తిరిగే పరిస్థితి లేదు. అయితే జక్కన్న ఏమో ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్ సహా ముగ్గురు విదేశీ నటులను తీసుకున్నారు. వీరిలో ఒకరు ఎన్టీఆర్ హీరోయిన్ అయిన ఒలీవియా మోరిస్, ఆమె లండన్ కి చెందిన ఆర్టిస్ట్ కాగా ఆమెను ఈ లాక్ డౌన్ సమయంలో ఇండియాకి రావడం అనేది జరగని పని. ఆమె కాక వివిధ భాషలకు చెందిన నటులు ఈ చిత్రంలో భాగమై ఉండగా వారందరినీ ఇప్పుడు అసెంబుల్ చేయడం కూడా సమస్యగా మారింది. ఎన్టీఆర్, చరణ్ మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. ముంబై లో ఉన్న అలియా భట్, అజయ్ దేవ్ గణ్ కూడా పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. 

More Related Stories