English   

మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్న అనుష్క 

Anushka
2020-06-12 13:51:22

అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ షూట్ అంతా రెడీ అయి రిలీజ్‌కి రెడీగా ఉంది. కరోనా దెబ్బ లేకుండా ఉంటే ‘నిశ్శబ్దం’ సినిమా నెలన్నర క్రితమే థియేటర్స్‌లో సందడి చేసేది. ఈ సినిమాని ఏప్రిల్ 2న విడుదల చేయడానికి అంతా రెడీ కాగా కరోనా దెబ్బకు ఆగింది. నిజానికి గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల రీత్యా వాయిదా పడింది. హేమంత్ దర్శకత్వంలో నిశ్శబ్దం తెరకెక్కింది. అయితే ఈ సినిమా తరువాత ఆమె చేయాల్సిన సినిమా ఎక్కడా పెద్దగా చర్చ జరగలేదు. అయితీ ఆమె తదుపరి సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త బయటకొచ్చింది. 

అదేంటంటే స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసే కంటే నాయికా ప్రాధాన్యం ఉన్న కథల్ని తెచ్చే యువ దర్శకులకే స్వీటీ అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేయాలనీ ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆమె మరోసారి లేడీ ఓరియెంటెడ్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ సారి మిర్చి-భాగమతి లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన యువీ క్రియేషన్స్ తో స్వీటీ టై అప్ అవుతోందని అంటున్నారు. రా రా కృష్ణయ్య సినిమాకి దర్శకుడిగా చేసిన మహేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.  

More Related Stories