English   

ఆ ఇద్దరు హీరోయిన్స్ రాధవేంద్ర రావు పళ్ళ నుండి తప్పించుకున్నారు...ఎందుకో తెలుసా 

Jayaprada Jayasudha
2020-06-13 12:35:09

తెలుగు సహా అన్ని బాషల దర్శకులకి ఒక్కోక్కరికి ఒక్కో మార్క్ ఉంటుంది. ఆ మార్క్ ఏర్పడే వరకూ ఏమో కానీ అది ఏర్పడిందంటే దానిని నిలబెట్టుకోడానికి ఆయా దర్శకులు చేయని ప్రయత్నాలు ఉండవు. అంటే రాఘవేంద్ర రావు సినిమాల్లో హీరోయిన్ల బొడ్డుపై పూలు, పళ్ళు విసరడం, ఆర్ నారాయణ మూర్తి సినిమాలో విప్లవ పాటలు, కొరటాల శివ సినిమాల్లో ఒక మెసేజ్, పూరి సినిమాల్లో హీరో బేవర్స్ గా తిరగడం లాంటివి ఈ కోవలోకే వస్తాయి. అయితే ఇప్పుడు రాఘవేంద్ర రావు మార్క్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 

రాఘవేంద్రరావు సినిమా అనగానే అందరికి గుర్తొచ్చేది హీరోయిన్లు బోడ్డ్లు వాటి మీద పూలు పండ్లు అనే కాన్సెప్టే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాల్లో పాటల్లో హీరోయిన్ల నడుముల మీద ఎక్కువగా పండ్లను ఉపయోగిస్తారనేది టాక్. ఈ విషయం మీద కామెంట్స్ కూడా చేసి అభాసు పాలయింది నటి తాప్సీ, ఆయన సినిమాల్లో నటించిన ప్రతి హీరోయిన్ మీద ఆయన ఈ పూలు, పండ్ల కాన్సెప్ట్ ని ప్రయోగించారు కానీ జయసుధ,జయప్రదపై మాత్రం ఉపయోగించలేదని గుర్తించారు. అయితే ఒక చానల్ లో ఈ విషయం మీద చర్చ కరగ్గా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు రాఘవేంద్రరావు. జయసుధ,జయప్రదలని చూస్తే అసలు అలాంటి ఆలోచనే వచ్చేది కాదని ఎందుకో కానీ వాళ్లని చూడగానే నిండుదనం ఉట్టిపడుతున్నట్టుగా అనిపించేదని చెప్పుకొచ్చారు. అంతేకాక సినిమాల్లో పండ్లను ఉపయోగించడం మొదలు పెట్టింది యాభై సినిమాల తరువాత నుండి అని చెప్పుకొచ్చారు.  

More Related Stories