అనూహ్యంగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్

నటి నిత్యామీనన్ టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలో సన్నగా ఉన్న ఈ భామ ఉన్న కొద్దీ బొద్దుగా తయారయ్యింది. ఇక ఈ మధ్య కాలంలో అయితే బాగా లావైపోయింది. ఐరన్ లేడీ పేరుతో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నిత్య జయలలిత పాత్ర చేస్తున్నారు. జయలలిత కొంచెం లావుగా ఉంటారు కాబట్టి ఆమె లుక్ కోసమే నిత్య బరువు పెరిగినట్టు పేర్కొన్నారు. అయితే ఆ తరువత ఆమె సినిమాల గురించి ఎటువంటి అప్డేట్ లేదు, అయితే అనూహ్యంగా ఇప్పుడు ఒటీటీ ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. కొన్ని నెలల నుండి నిత్యామీనన్ డిజిటల్ ఎంట్రీపై వార్తలు వినపడుతూ ఉన్నా ఆమె దాని గురించి ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ సడన్ గా అభిషేక్ బచ్చన్‌తో కలిసి 'బ్రీత్... ఇన్ టు ది షాడోస్' వెబ్ సిరీస్‌లో నిత్యామీనన్ నటించి సర్ప్రైజ్ ఇచ్చింది. అమేజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న ఈ వెబ్ సిరీస్‌లో అమిత్ సాద్, సయామీఖేర్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. రెండో సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను అభిషేక్ తాజాగా విడుదల చేశారు. జులై 10న ఈ సిరీస్ ప్రారంభం కాబోతోంది.ఈ వెబ్ సిరీస్‌లో అమిత్ సాద్, సయామీఖేర్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. మయాంక్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సీజన్ 1 ను సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించారు.