English   

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య..

Sushant Singh Rajput
2020-06-14 14:52:51

బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెస్ ధోనీ సహా మరికొన్ని సినిమాల్లో నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 34 సంవత్సరాల వయసున్న ఈయన బాంద్రాలోని తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. ఈయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. నాలుగు రోజుల కింద ఈయన మాజీ మేనేజర్ కూడా ఆత్మహత్య చేసుకుంది.  అయితే ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ఇంత చిన్న వయసులో ట్యాలెంట్ ఉన్న నటుడు ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.

More Related Stories