English   

రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం.. డ్రైవర్ అరెస్ట్.. 

Ramya Krishnan
2020-06-14 17:21:09

సీనియర్‌ నటి రమ్యకృష్ణ అనుకోకుండా వార్తల్లోకి వచ్చింది. ఆమె కారు డ్రైవర్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తున్న రమ్యకృష్ణ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపారు. భారీగా మద్యాన్ని, కారును సీజ్‌ చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రమ్యకృష్ణ కారులో 96 బీర్ బాటిళ్లు, 8 ఫుల్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తున్న రమ్యకృష్ణ పేరు మీదున్న ట‌యోటా ఇన్నోవా క్రిస్టా( టీఎన్‌07క్యూ 0099) కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో మద్యం బాటిల్స్ కనిపించాయి. దీంతో అక్కడిక్కడే కారును, మద్యాన్ని సీజ్‌ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. చెన్నైలో మద్యం లభించపోవడంతో మహాబలిపురం నుండి మద్యం తెస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై ఇప్పటి వరకు రమ్యకృష్ణ స్పందించలేదు. కారు డ్రైవర్ సెల్వకుమార్ అని తెలుస్తుంది. ఈయనపై కేసు నమోదు చేసారు పోలీసులు. బెయిల్‌పై ఈయన విడుదలైనట్లు ప్రచారం జరుగుతుంది. 

More Related Stories