English   

లాక్‌డౌన్‌ సడలింపుల్లో..వెన్నెల కిషోర్‌ డబ్బింగ్ ..

Vennela Kishore
2020-06-14 17:32:26

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి కమెడియన్స్ అంతా దాదాపు కనుమరుగు అయినట్టే. చాలా మంది కాలం చేయగా బ్రహ్మానందం లాంటి వాళ్ళు అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. ఇక ఇప్పుడు పరిశ్రమలో మోస్ట్‌ వాంటెడ్‌ కమెడియన్‌ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు వెన్నెల కిషోర్‌. వెన్నెల అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన పేరు వెన్నెల కిషోర్ గా ఫిక్స్ అయిపొయింది. ఇక ఆయనకి నటనలోనే కాదు దర్శకత్వం విభాగంలోనూ మంచి పట్టు ఉంది. అప్పట్లో తన దర్శకత్వ ప్రతిభను నమ్ముకొని బ్రహ్మానందంతో ‘జప్ఫా’ అనే ఒక సినిమా కూడా చేశారు. అయితే అది అది బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిందనుకోండి అది వేరే విషయం. ఈ దెబ్బతో మనోడు మళ్ళీ దర్శకత్వం జోలికి వెళ్లలేదు. 

అయితే తాజాగా ఆయన చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. కరోనా లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని రకాల షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సినిమా షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ పనుల్ని మొదలుపెడుతున్నారు. వెన్నెల కిశోట్ కూడా డబ్బింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా తీసిన ఫన్నీ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. అందులో ఆయన డబ్బింగ్‌ చెప్పడానికి ముందే అక్కడి రికార్డింగ్‌ మైక్‌ను పక్కన పరిసరాల్ని శానిటైజ్‌ చేస్తూ కనిపించారు. ‘డబ్బింగ్‌ చెప్పడానికి ముందు స్ప్రే చేసుకోండి.. లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ లబ్‌ డబ్బింగ్‌.. బిక్కు బిక్కు జీవితం’ అంటూ ఒక క్యాప్షన్‌ ఇకూడా ఇచ్చారు.

More Related Stories