ఆ భూముల కోసం చరణ్ చిరుల ఫైట్

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతేడాది దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా కొంత జరుపుకుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఆగింది. ఈ సినిమాలో ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగిగా చిరు కనిపించనున్నారని, వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని ప్రచారం సాగుతోంది. గతంలో చోటుచేసుకున్న సింహాచల దేవస్థాన భూముల కబ్జా ఆధారంగా కొరటాల ఈ చిత్ర కథను అల్లుకున్నాడని సింహాచలం దేవస్థానం నేపథ్యంలో గుడిమాన్యాలను కాజేసే అక్రమార్కుల భరతం పట్టే వ్యక్తిగా చిరు దర్శనమిస్తారని ప్రచారం జరుగుతోది.
కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. దీంతో మెగా మల్టీస్టారర్‌పై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాక ఈ సినిమాలో రామ్ చరణ్ - చిరంజీవి మధ్య ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి అండర్ కవర్ అధికారిగా కనిపించబోతున్నాడట. దేవాదాయ శాఖలో పని చేస్తూ నక్సలైట్ అయిన రామ్ చరణ్ ను పట్టుకోడానికి ప్రయత్నాలు చేస్తుంటాడని అంటున్నారు. ఈ సమయంలోనే దేవాదాయ భూముల గురించి ఈ ఇద్దరి మధ్య ఫైట్ ఉంటుందని అంటున్నారు.