సుశాంత్ సింగ్ కెరీర్లో అద్భుతమైన సినిమాలు ఇవే..

నటించింది తక్కువ సినిమాలే అయినా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఆయన మృతితో ఒక్కసారిగా బాలీవుడ్ షాక్ అయిపోయింది. దాదాపు 90 శాతం సక్సెస్ రేట్ ఉన్న హీరో ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అనేది ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నటించిన సినిమాల్లో మరిచిపోలేనివి కొన్ని మీ కోసం..
1. కాయ్ పో చే: అప్పటి వరకు టెలివిజన్‌లో పేరు తెచ్చుకున్న సుశాంత్.. కాయ్ పో చే సినిమాతో హీరో అయ్యాడు. చేతన్ భగత్ 3 మిస్టేక్స్ ఆఫ్ లైఫ్ నవలా ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇది కూడా బ్లాక్‌బస్టర్ అయింది.
2. శుద్ధ్ దేశీ రొమాన్స్: ఈ సినిమాతో సోలో హీరోగా తన మార్కెట్ పెంచుకున్నాడు సుశాంత్. 2013లో రామ్ చరణ్ జంజీర్ విడుదలైన రోజు వచ్చిన ఈ చిత్రం అప్పట్లోనే 80 కోట్లకు పైగా వసూలు చేసింది.
3. ఎమ్మెస్ ధోనీ: సుశాంత్ కెరీర్లో సంచలన సినిమా ఎమ్మెస్ ధోనీ. నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయం సాధించింది. ఈ పాత్రకు ప్రాణం పోసాడు సుశాంత్.
4. పీకే: అమీర్ ఖాన్ పీకే సినిమా సాధించిన సంచలనం గురించి ఏం చెప్పాలి.. అందులో అమీర్‌తో పాటు మరో హీరోగా సుశాంత్ నటించాడు.
5. కేదార్నాథ్: సారా అలీ ఖాన్ డెబ్యూ మూవీగా వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధించింది. అభిషేక్ కపూర్ తెరకెక్కించిన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూస్‌తో ఓపెన్ అయినా కూడా కమర్షియల్ హిట్ కొట్టింది.
6. డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షీ: బక్షి నవల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ విజయం సాధించకపోయినా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
7. చిచోరే: దంగల్ దర్శకుడు నితేష్ తివారి తెరకెక్కించిన చిచోర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఆత్మహత్యల నేపథ్యంలోనే సాగుతుండటం గమనార్హం. ఇప్పుడు సుశాంత్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు.
8. సోంచారియా: గతేడాది విడుదలైన ఈ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. ఇందులో మనోజ్ బాజ్‌పెయ్ కూడా మరో కీలక పాత్రలో నటించాడు. సుశాంత్ నటన అద్భుతం అంటూ క్రిటిక్స్ కూడా పొగిడేసారు. సినిమా కూడా మంచి వసూళ్లనే తీసుకొచ్చింది.