English   

సొంత కొడుకుపైనే పోలీస్ కేసు పెట్టిన నటి..

Maala Parvathi
2020-06-15 07:51:36

తప్పు చేసిన కొడుకులను ఎలా బయటకు తీసుకురావాలా అని ఈ రోజుల్లో పేరెంట్స్ ఆలోచిస్తుంటారు. అలా కాకుండా తప్పు చేసింది తమ కొడుకు అని తెలిసినప్పుడు వాడికి శిక్ష పడాల్సిందే అని చాలా తక్కువ మందికి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇదే జరిగింది. అక్కడ మాల పార్వతి అనే నటికి మంచి గుర్తింపు ఉంది. ఆమె కొడుకు అనంతకృష్ణన్ పై ఇప్పుడు పోలీస్ కేసు నడుస్తుంది. ఆ కేసు పెట్టింది పార్వతి కావడం గమనార్హం. సినిమా షూటింగ్ సమయంలో ట్రాన్స్ జెండర్ మేకప్ ఆర్టిస్ట్ సీమ వినీత్ తో అనంతకృష్ణన్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలున్నాయి. అందులో నిజానిజాలు ఇంకా బయటికి రాలేదు. కానీ ఈ విషయంలో మాత్రం ఆ ట్రాన్స్ జెండర్ కే పార్వతి అండగా నిలబడింది.

అంతమాత్రాన తన కొడుకును తక్కువ చేయడం లేదని.. అతను తప్పు చేశాడని నమ్మడం లేదని.. అసలు నిజాలు పోలీసులు కోర్టు తేలుస్తుందని పార్వతి చెబుతుంది. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు.. ఇదే విషయం తన కొడుకు కూడా తన దగ్గర చెప్పాడు అంటుంది పార్వతి. తనకు ఇష్టం లేకుండా ఏ రోజు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించలేదని తన కొడుకు తనకు చెప్పాడని.. ఈ విషయంలో అసలు ఏం జరిగింది అనేది న్యాయస్థానం తేల్చి చెబుతోంది అంటుంది పార్వతి. ఒకవేళ నిజంగా తన కొడుకు తప్పు చేసి ఉంటే కచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఈ రోజుల్లో కూడా ఇలాంటి తల్లి ఉండటం నిజంగానే గర్వకారణం. ఈమె చేసిన పనికి మలయాళ ఇండస్ట్రీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. 

More Related Stories