English   

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను బాలీవుడ్ దూరం పెట్టిందా..

Sushant Singh Rajput
2020-06-15 08:47:35

సాధారణంగా సక్సెస్ లో ఉన్న స్టార్స్ వెనక అందరూ ఉంటారు. హీరో వరుస హిట్లు కొడుతుంటే ఆయనకు అందరూ కావాల్సిన వాళ్లే. కానీ విచిత్రంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో మాత్రం ఇది నిజం కాదని తెలుస్తుంది. కెరీర్ లో అన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్నా కూడా ఆయనను మాత్రం బాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు కొందరు హీరోలు అంతగా పట్టించుకోలేదని.. దూరం పెట్టారని ఇప్పుడు వినిపిస్తున్న వార్త. ఒకవేళ నిజంగా ఆయన పట్టించుకుని ఉంటే.. మిగిలిన హీరోల మాదిరిగా ఆయనను కూడా ట్రీట్ చేసి ఉంటే ఈరోజు ఒక అనాధ అలా చనిపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు అభిమానులు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అగ్ర దర్శకులు.. కొందరు టాప్ హీరోలు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను దూరంగా పెట్టారని ప్రచారం జరుగుతోంది. అది ఆయన సక్సెస్ ను చూసి ఓర్వలేని తనం కూడా కావచ్చు అంటున్నారు విశ్లేషకులు.

ఈ విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు సుశాంత్. తన మిగిలిన హీరోల మాదిరి ఏ పార్టీలకు ఎవరు పిలవరని.. తనతో ఎవరూ కలివిడిగా ఉండట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను ఎందుకు దూరం పెట్టారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సమాధానం ఏదైనా కావచ్చు కానీ ఈరోజు ఆయన తన మనసులో బాధ చెప్పుకోలేక మానసిక ఒత్తిడికి గురై 34 ఏళ్ల చిన్న వయసులోనే కన్నుమూశాడు. ఆయన లేని లోటు మాత్రం ఇండియన్ సినిమాకు అలాగే ఉండిపోతుంది. 

More Related Stories